Vijay Devarakonda Video Call : అర్ధరాత్రి..సమంత కు ఫోన్ చేసి..విజయ్ ఏం అడిగాడో తెలుసా..?
సమంత వీడియో కాల్ చేయడమే కాకుండా నిన్ను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ తెలుపడం తో అభిమానులు
- Author : Sudheer
Date : 27-08-2023 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)..హిట్ , ప్లాప్ లతో సంబంధం లేని హీరో. అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న విజయ్.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ యూత్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఖుషి (Kushi Movie) మూవీ తో సెప్టెంబర్ 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సమంత (Samantha ) నటించింది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసాయి. ప్రస్తుతం సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుండడం తో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వూస్ ఇస్తూ సినిమా విశేషాలను (Kushi Promotion ) పంచుకుంటున్నారు. అయితే అనారోగ్యం కారణంగా సమంత పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకానప్పటికీ..విజయ్ తనదైన స్టయిల్ లో సినిమా ఫై క్రేజ్ తెస్తున్నాడు.
Read Also : ISRO : చంద్రుడిపై ఉష్ణోగ్రత ఎంతో ఉందో తెలిపిన ఇస్రో
తాజాగా అర్ధరాత్రి సమంత కు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియోను (Vijay Devarakonda Video Call With Samantha) షేర్ చేశాడు విజయ్. సామ్ కి కాల్ చేసి నాక్ నాక్ జోక్ చెప్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. ఇక ఇందులో సమంత అర్ధరాత్రి ఒకటిన్నర అయ్యిందని, ఇప్పుడు జోక్ ఏంటి అని అడగడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్ధరాత్రి సమంత వీడియో కాల్ చేయడమే కాకుండా నిన్ను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ తెలుపడం తో అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం అసలు సామ్ ఆ వీడియో కాల్ మాట్లాడింది లేదని, అది సెల్ఫీ వీడియో అని చెపుతున్నారు. ఆ విషయం ఆమె గ్లాసెస్ లో స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. వీడియో కాల్ లా చూపిద్దామనుకున్నా.. సామ్ ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది అయితేనేం సినిమాకు కావాల్సిన ప్రమోషన్ వస్తుందిగా అని సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Knock knock
Who is there?#Kushi is – in 4 days! Yayyyy! 🥰@Samanthaprabhu2 pic.twitter.com/9lfNfxPbGk— Vijay Deverakonda (@TheDeverakonda) August 27, 2023