Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ పక్కన పూజా హగ్దే ..మాములుగా లేదుగా ..!!
- By Sudheer Published Date - 02:33 PM, Sun - 3 March 24

ఫ్యామిలీ స్టార్ (Family Star) గా రాబోతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పక్కన బుట్టబొమ్మ పూజా హగ్దే (Pooja Hegde) అదిరిపోయే స్టెప్స్ వేసి అదరగొట్టింది. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాలతో యూత్ స్టార్ గా మారిన విజయ్..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఆ మధ్య వచ్చిన లైగర్ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. పూరి – విజయ్ కలయికలో ఈ సినిమా రావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు..కానీ ఈ మూవీ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ గా రాబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులోని ‘ఐరనే వంచాలా ఏంటి’ అన్న డైలాగ్ నెట్టింట ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తుండటం వల్ల ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మరింతగా ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఈ మూవీ నుంచి నంద నందనా అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్యాచీ లైన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ మెలోడీ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఇదే సాంగ్‌కు విజయ్ దేవరకొండ, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి స్టెప్పులేశారు. ఓ కాలేజ్‌లో నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్‌లో ఈ ఇద్దరూ సందడి చేశారు. ఫెస్ట్‌లో భాగంగా ఈ పాటకు డ్యాన్స్ చేసి స్టూడెంట్స్‌ను అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేజ్ ఫై ఈ ఇద్దరి జోడి చూసిన ఫ్యాన్స్..వీరి కలయికలో సినిమా వస్తే బాగుండని కోరుకుంటున్నారు.
Cutest #VijayDevarakonda and #PoojaHegde doing the signature step of #Nandanandana from #FamilyStarpic.twitter.com/61CDkuTzsT
— Yellow Bird (@YellowLove243) March 2, 2024
Read Also : Regina : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా..?