Regina : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా..?
- Author : Sudheer
Date : 03-03-2024 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమలో మొన్నటి వరకు బ్యాచలర్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన నటి నటులంతా ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కావాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా..తాజాగా వరలక్షి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)..ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్దేవ్తో మార్చి 1నే సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకోగా..ఇప్పుడు హీరోయిన్ రెజీనా (Regina ) సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.
We’re now on WhatsApp. Click to Join.
మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టిన రెజీనా..ఆ తర్వాత హీరోయిన్గా మారిపోయింది. 2012లో శివ మనసులో శృతి అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రొటీన్ లవ్ స్టోరీ వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. అలా వరుస సినిమాలు చేస్తూ మంచి యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అందాల ఆరబోత తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఇదే క్రమంలో సాయి తేజ్ , సందీప్ కిషన్ తో రిలేషన్షిప్లో ఉందంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల అవకాశాలు తగ్గడం తో పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని ఫిక్స్ అయ్యింది.
ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. దసరాలోపు రెజీనా పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Read Also : Vastu Tips: ఇంట్లో చీమలు కనిపించడం అశుభమా.. ఏ దిశలో కనిపిస్తే అదృష్టమో తెలుసా?