Vijay Antony : పుట్టెడు దుఃఖంలో కూడా విజయ్ ఆంటోని కీలక నిర్ణయం
శోకసంద్రంలో ఉన్నప్పటికీ విజయ్.. మాత్రం తన వృత్తి ధర్మాన్ని మరచిపోలేదు. తన కొత్త సినిమా ‘రత్తం’ విడుదల ఆపకూడదని నిర్మాతలకు సూచించారు
- By Sudheer Published Date - 01:41 PM, Sat - 23 September 23

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని (Vijay Antony) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తన పెద్ద కుమార్తె మీరా(16) నాల్గు రోజుల క్రితం ఆత్మహత్య (Vijay Antony Daughter Meera Dies) చేసుకొని చనిపోయింది. ఈ ఘటన విజయ్ ఇంట విషాద ఛాయలు నెలకొల్పింది. విజయ్ కి మీరా ( Meera ) అంటే ఎంత ఇష్టమో చాల సందర్భాలలో చెప్పుకొన్నారు. అలాంటి కూతురు మరణం విజయ్ తట్టుకోలేకపోతున్నాడు. విజయ్ పరిస్థితి చూసి చాలామంది సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మీరా మృతి తర్వాత సోషల్ మీడియాలో విజయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మీరాతోపాటు తాను కూడా చనిపోయానని రాసుకొచ్చారు. ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి పెద్ద కూతురు వెళ్లింది. మీరా ఎంతో ప్రేమగా ఉండేది. ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లింది. తాను వెళ్లినప్పటికీ.. ఇప్పటికీ తనతో మాట్లాడుతోంది.
Read Also : BRS Party: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
మీరాతోపాటు తను చనిపోయాను. ఆమెతో సమయం గడపడం ప్రారంభించాను. ఇకపై తాను చేసే ప్రతీ సేవా కార్యక్రమాన్ని మీరా పేరుతో ప్రారంభిస్తాను’ అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. విజయ్ షేర్ చేసిన పోస్ట్ ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇలా శోకసంద్రంలో ఉన్నప్పటికీ విజయ్.. మాత్రం తన వృత్తి ధర్మాన్ని మరచిపోలేదు. తన కొత్త సినిమా ‘రత్తం’ విడుదల ఆపకూడదని నిర్మాతలకు సూచించారు. తన సమస్య కారణంగా సినిమా ఆగిపోతే నిర్మాతలు నష్టపోతారని భావించిన విజయ్.. అనుకున్న తేదీకే (అక్టోబర్ 06) సినిమాను విడుదల చేయాలని చెప్పారట. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చిత్రసీమ ప్రశంసిస్తుంది.