RGV : జైలు శిక్షపై వర్మ రియాక్షన్
RGV : శిక్షతో పాటు 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యతను కూడా వర్మపై మోపింది. ఈ శిక్షపై రామ్ గోపాల్ స్పందించారు
- By Sudheer Published Date - 03:24 PM, Thu - 23 January 25

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)కి అంథేరీ కోర్టు చెక్ బౌన్స్ కేసు(cheque-bouncing case)లో మూడు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2018లో మహేష్ చంద్ర మిశ్రా దాఖలు చేసిన కేసులో కోర్టు వర్మపై తీర్పు నేడు వెలువరించింది. శిక్షతో పాటు 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యతను కూడా వర్మపై మోపింది. ఈ శిక్షపై రామ్ గోపాల్ స్పందించారు.
Telangana Record In Davos: దావోస్‌లో తెలంగాణ సరికొత్త రికార్డు.. 46 వేల మందికి జాబ్స్!
‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు. ఇక ఈ కేసు గత ఏడు సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు కొనసాగుతుండగా.. వర్మ కోర్టుకు హాజరుకావడం మానేయడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది. వర్మకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం, తీర్పును కఠినంగా అమలు చేయడం ఈ కేసుకు మరింత ప్రాచుర్యం దక్కింది. రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు , కేసులు, కోర్ట్ లు కొత్తమీ కాదు. ఇదిలా ఉంటె రీసెంట్ గా వర్మ తన తప్పులు తెలుసుకొని మళ్లీ తన సత్తా ఏంటో చూపిస్తా అని ధీమా వ్యక్తం చేస్తూ కొత్త సినిమాను ప్రకటించాడు. ఇంతలో కోర్ట్ జైలు శిక్ష ఖరారు చేసింది. మరి ఈ తీర్పు నేపథ్యంలో వర్మ లాయర్లు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది చూడాలి.