Vennela Kishore: ‘చారి 111’గా ‘వెన్నెల’ కిశోర్ ఫస్ట్ లుక్, స్పై యాక్షన్ కామెడీలో స్టైలిష్ లుక్
వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు.
- By Balu J Published Date - 12:33 PM, Tue - 14 November 23
![Vennela Kishore: ‘చారి 111’గా ‘వెన్నెల’ కిశోర్ ఫస్ట్ లుక్, స్పై యాక్షన్ కామెడీలో స్టైలిష్ లుక్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/11/chary.jpg)
Vennela Kishore: ‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘చారి 111’ కాన్సెప్ట్ టీజర్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేశారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడం ఆ కేసును పరిష్కరించడానికి కన్ ఫ్యూజ్డ్ స్పై చారి (వెన్నెల కిశోర్) వస్తారు.
ఆ కేసును చారి ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాగా తెలుస్తుంది. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… ‘వెన్నెల’ కిశోర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ‘చారి 111’లో ఓ సీరియస్ కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండబోతుంది.
‘చారి 111’ ఫస్ట్ లుక్ పోస్టర్లో వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ వెనుక చూస్తే ఛార్మినార్ కనబడుతోంది. హైదరాబాద్ సిటీ నేపథ్యం కథ అని తెలుస్తోంది. ఇంకా బాంబు బ్లాస్ట్ దృశ్యాలు, స్టైలిష్ కార్ కూడా ఉన్నాయి. అసలు కథ ఏమిటనేది తెలియడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ”ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే కన్ ఫ్యూజ్డ్ స్పై ‘వెన్నెల’ కిశోర్ ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాలో చూడాలి.
గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు” అని చెప్పారు. చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ”స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంటోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘చారి 111’ పాటలు విడుదల కానున్నాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Hero Nikhil: హీరో నిఖిల్ చేతుల మీదుగా రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/nikhil.jpg)
Hero Nikhil: హీరో నిఖిల్ చేతుల మీదుగా రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్
Hero Nikhil: కులం రక్తం మీద ఆధారపడి ఉండదు.. అది పుట్టుకతోనే వస్తుంది… కులం అనేది మనం జీవితంలో చేసే పనులపై ఆధారపడి ఉంటుంది.’, ‘జీవితంలో అతి పెద్ద వ్యసనం మద్యం, సిగరెట్లు, బెట్టింగ్ కాదు. అతి పెద్ద వ్యసనం ఒక వైఫల్యం. మనకు తెలియకుండానే మన జీవితంలో ఉన్న వాటితో రాజీపడేలా చేస్తుంది. వైఫల్యం మనల్ని దేనికీ అనర్హులమని నిర్దేశిస్తుంది, బాస్ లాగా మనల్ని నియంత్రిస్తుంది…’, ‘ఇక్కడ ప�