Venkatesh : వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బిజినెస్ లెక్కలివే..!
Venkatesh సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఈ సినిమా కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా ఉంటుందనిపిస్తుంది. ముఖ్యంగా వెంకటేష్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్
- By Ramesh Published Date - 07:42 AM, Wed - 8 January 25

Venkatesh : విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి (Anil Ravipudi,) కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. ఐతే అలా వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎఫ్2, ఎఫ్3 రెండు హిట్ కాగా ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. వెంకటేష్ ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమా సంక్రాంతి సినిమాల బిజినెస్ లో మంచి బిజినెస్ చేసింది. నిర్మాత దిల్ రాజు నైజాం లో తానే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు. ఆంధ్రాలో ఈ సినిమాకు 15 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు రెస్టాఫ్ ఇండియా మరో 15 నుంచి 20 కోట్లు రాబట్టింది. సో ఓవరాల్గా 50 కోట్ల కన్నా తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది.
వెంకటేష్ మార్క్ ఎంటర్టైన్మెంట్..
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఈ సినిమా కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా ఉంటుందనిపిస్తుంది. ముఖ్యంగా వెంకటేష్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ అన్ని కూడా బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. మరి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నా సంక్రాంతి విన్నర్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
ఈ సినిమా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. గోదారి గట్టు మీద రామచిలకమ్మ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ కాగా సినిమాలో ఆ సాంగ్ థియేటర్ లో హంగామా చేసేలా ఉంది.