Veera Simha Reddy Trailer: నాది ఫ్యాక్షన్ కాదు .. సీమ మీద ఎఫెక్షన్!
బాలకృష్ణ కథానాయకుడిగా రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో 'వీరసింహారెడ్డి' సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Author : Balu J
Date : 07-01-2023 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
Veera Sinha Reddy: బాలకృష్ణ కథానాయకుడిగా రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బి. గోపాల్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారనే సంగతి తెలిసిందే. ఆ రెండు పాత్రలను ఈ ట్రైలర్ లో రివీల్ చేశారు. ఈ సినిమా కథ .. బాలయ్య పాత్రకి తగినట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ‘నాది ఫ్యాక్షన్ కాదు .. సీమ మీద ఎఫెక్షన్’ .. ‘పదవి చూసుకుని నీకు పొగరెక్కువేమో .. బై బర్త్ నా డీఎన్ ఏకే పొగరెక్కువ’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
మాస్ డైలాగులు .. ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగే యాక్షన్ .. మాస్ బీట్స్ .. అందుకు తగిన మాస్ స్టెప్పులు .. ఇవన్నీ కూడా ఈ ట్రైలర్ లో కవర్ అయ్యేలా చూశారు. సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేశారు. బాలయ్య చెప్పిన కొన్ని డైలాగ్స్ గురించి జనం మాట్లాడుకోకుండా ఉండరనేది ఖాయం.