Varun Tej : వరుణ్ తేజ్ కి సినీ పరిశ్రమలో ఆ హీరో ఒక్కడే ఫ్రెండ్ అంట.. ఎవరా హీరో?
తాజాగా హీరో వరుణ్ తేజ్ తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాడు.
- By News Desk Published Date - 10:26 AM, Sun - 17 November 24

Varun Tej : సినీ పరిశ్రమలో స్టార్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది చిన్నప్పట్నుంచి కలిసి చదువుకున్న వాళ్ళు, కొంతమంది సినీ పరిశ్రమలో పరిచయమైన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. తాజాగా హీరో వరుణ్ తేజ్ తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాడు.
వరుణ్ తేజ్ ఇటీవలే మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైంది. రెగ్యులర్ కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వరుణ్ తేజ్ ప్రాణం పెట్టి నటనలో తన బెస్ట్ ఇచ్చినా కథ ఏమి లేకపోవడంతో సినిమాని ఎవరూ పట్టించుకోవట్లేదు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ టాపిక్ రాగా వరుణ్ మాట్లాడుతూ.. నాకు బయట స్కూల్ ఫ్రెండ్స్ ఓ పది, పన్నెండు మంది ఉన్నారు. ఇప్పటికి వాళ్ళతోనే ఎక్కువ గడుపుతాను. సినీ పరిశ్రమలో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. హీరో నితిన్ ఒక్కడే నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం చాలా క్లోజ్ ఉంటాము అని తెలిపాడు.
వరుణ్ – లావణ్య పెళ్ళికి కేవలం మెగా ఫ్యామిలీ ఒక్కటే వెళ్లినా ఇండస్ట్రీ నుంచి నితిన్ ఒక్కడే వెళ్ళాడు. వీరిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది.
Also Read : Allu Arjun : నాకు పౌరాణికాలు చేయాలంటే భయం.. బాలయ్య షోలో అల్లు అర్జున్ వ్యాఖ్యలు..