Varun Tej : మట్కా కలెక్షన్స్ మరీ ఇంత ఘోరంగానా..?
Varun Tej మట్కా ఫస్ట్ డే కేవలం 90 లక్షల దాకా రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు 40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించాయి. కానీ ఎందుకో ఆడియన్స్ సినిమాను
- By Ramesh Published Date - 08:30 PM, Fri - 15 November 24

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుణ కుమార్ (Karuna Kumar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కొత్త సీసాలో పాత సారా అంటూ అటు రివ్యూయర్స్, ఇటు ఆడియన్స్ అంతా సినిమా చూసి పెదవి విరిచారు. ఐతే ఎంత టాక్ బాగా లేకపోయినా మెగా హీరో సినిమాకు ఒక మోస్తారు కలెక్షన్స్ వస్తాయి. కానీ వరుణ్ తేజ్ మట్కా కలెక్షన్స్ ( Matka Collections) షాక్ ఇస్తున్నాయి. ఓవరాల్ గా కనీసం ఫస్ట్ డే కోటి కూడా దాటలేకపోవడం ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.
మట్కా ఫస్ట్ డే కేవలం 90 లక్షల దాకా రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు 40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించాయి. కానీ ఎందుకో ఆడియన్స్ సినిమాను రిసీవ్ చేసుకోలేకపోయారు. మరీ ఘోరంగా కోటికి తక్కువ అది కూడా ఫస్ట్ డే రావడం వరుణ్ తేజ్ (Varun Tej) గ్రాఫ్ ఎంత డౌన్ ఫాల్ అయ్యిందో తెలుస్తుంది.
కమర్షియల్ అంశాలతో సంబంధం లేకుండా..
వరుణ్ తేజ్ కమర్షియల్ అంశాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎందుకో అవి సరిగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ సరైన హిట్ కొట్టింది లేదు. సినిమాల బడ్జెట్ ఏమో 40 నుంచి 50 కోట్ల దాకా అవుతున్నాయి. వసూళ్లేమో దానిలో 10 శాతం కూడా రావట్లేదు.
మట్కా పరిస్థితి కూడా అదేలా కనిపిస్తుంది. సినిమాకు 40 కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి ఫుల్ రన్ లో 4 కోట్లైనా చేస్తుందా అన్న డౌట్ వస్తుంది. కెరీర్ విషయంలో వరుణ్ తేజ్ జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు.
Also Read : Mahesh Athidhi : ‘అతిధి’ మళ్లీ వస్తున్నాడు