Mahesh Athidhi : ‘అతిధి’ మళ్లీ వస్తున్నాడు
Mahesh Athidhi : సూపర్ స్టార్ మహేష్ బాబు - సురేందర్ రెడ్డి (Mahesh Babu - Surendar Reddy) కలయికలో తెరకెక్కిన 'అతిధి' (Athidhi) మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది
- By Sudheer Published Date - 08:08 PM, Fri - 15 November 24

టాలీవుడ్ (Tollywood) బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద సరైన సినిమాలు పడడమే లేదు. చిన్న చితక హీరోల సినిమాలు వస్తున్నప్పటికీ..మధ్య మధ్య లో పెద్ద హీరోలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం సంతృప్తి పరచడం లేదు. ఈ క్రమంలో నిర్మాతలు రీ రిలీజ్ ల ట్రెండ్ ను మొదలుపెట్టారు. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు.
ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – సురేందర్ రెడ్డి (Mahesh Babu – Surendar Reddy) కలయికలో తెరకెక్కిన ‘అతిధి’ (Athidhi) మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 2007లో రిలీజ్ అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అమృతారావు ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా..వక్కంతం వంశీ కథ అందించారు. మణిశర్మ మ్యూజిక్ చేసారు. ఈ మూవీ ఇప్పుడు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న 4kలో రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఇప్పుడు ఈ మూవీ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Read Also : Yamaha Comic Con : యమహా నుండి కామిక్ కాన్