Varun Tej-Lavanya: హనీమూన్ కు వెళ్లిన వరుణ్, లావణ్య జంట.. చక్కర్లు కొడుతున్న ఫొటో
వరుణ్ తేజ్ ప్రస్తుతం రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బిజీగా ఉన్నాడు.
- By Balu J Published Date - 04:03 PM, Mon - 4 December 23
Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి నవంబర్ 1, 2023న ఇటలీలో జరిగిన వేడుకలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరు ప్రయాణం ఆనందంగా సాగుతోంది. అయితే వరుణ్ తేజ్ తన బెటర్ హాఫ్ లావణ్యతో కలిసి ఒక సంతోషకరమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వారు విహారయాత్రకు బయలుదేరినట్లు వెల్లడించారు. ఈ జంట తమ హనీమూన్ కోసం యూరప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో తీసుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బిజీగా ఉన్నాడు. మరికొన్నిసినిమా కథలను వింటున్నాడు. ప్రస్తుతం అందాల జంట ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
Also Read: Kishan Reddy: తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తాం, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాం!