Renu Desai : ప్లీజ్..కనీసం రైస్ అయినా పంపండి..ఫ్యాన్స్ ను వేడుకుంటున్న రేణు దేశాయ్
అర్జెంట్ రిక్వెస్ట్.. మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి ఎవరైనా మాకు బియ్యం సహాయం చేయగలరా? ప్లీజ్ మాకు ప్రతి నెలా 300kgs కావాలి.. 4 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24kgs/నెల బియ్యం అందుతుంది
- By Sudheer Published Date - 03:07 PM, Sat - 10 August 24

పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణుదేశాయ్ (Renu Desai)..సోషల్ మీడియా వేదికగా కుక్క పిల్లలకు డొనేషన్‌గా రైస్ కావాలంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో భాగంగా.. అర్జెంట్ రిక్వెస్ట్.. మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి ఎవరైనా మాకు బియ్యం సహాయం చేయగలరా? ప్లీజ్ మాకు ప్రతి నెలా 300kgs కావాలి.. 4 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24kgs/నెల బియ్యం అందుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇవ్వగలరా. అలా 10 కుటుంబాలు అయినా విరాళం ఇవ్వగలిగితే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీ స్నేహితులు మరియు బంధువులతో ఈ విషయాన్ని షేర్ చేయండి.. అంటూ రాసుకొచ్చింది. కాగా ఆమె 50 కేజీల రైస్ ఇచ్చినట్లు ఆ పోస్ట్‌లోనే పేర్కొంది. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
చిన్న పిల్లల కోసం, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం తన సంపాదనలో నెల నెలా కొంత మొత్తాన్ని విరాళంగా రేణు ఇస్తుంటుంది. ఆవుల కోసం సొంతంగా ఓ షెడ్డును కూడా నిర్మించింది. ఇలా జంతువుల దాన కోసం ఆమె సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తుంటుంది. గత్తంలో కూడా ఇలాంటి అడిగింది. ఇప్పుడు మరోసారి అదే పని చేసింది.
Read Also : Journalist Yogi Reddy : కూతురికి ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్