Upasana : మా అత్తమ్మే నాకు స్ఫూర్తి – ఉపాసన
- Author : Sudheer
Date : 07-03-2024 - 4:53 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా కోడలు ఉపాసన మరోసారి తన అత్తమ్మ ఫై ప్రేమను కురిపించి వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఉపాసన ..తన అత్తమ్మ సురేఖ బర్త్ డే సందర్భంగా ”అత్తమ్మ కిచెన్’ (Athamma’s Kitchen)’ను ప్రారంభించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ‘రెడీ టు ఈట్’ సౌతిండియా ఆహారాన్ని ఎంతో రుచిగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు… అత్తమ్మ పుట్టినరోజు నాడే ఈ కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు మా అత్తమ్మ సురేఖ గారు చాలా ప్రేమగా ఉంటారు.. ఆవిడే నాకు స్ఫూర్తి అని తెలిపి మెగా అభిమానుల్లో ఆనందం నింపింది. బుధువారం నాలెడ్జి సిటీలోని టి-హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాసన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మా అత్తమ్మ సురేఖ గారు చాలా ప్రేమగా ఉంటారు.. ఆవిడే నాకు స్ఫూర్తి. ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో అయినా ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమం. అందుకోసమే నేనే ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమంలో ఎలికో లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ వనితా దాట్ల పాల్గొని.. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ప్రతీ కుటుంబంలో మహళల ప్రభావితం ఎక్కువగా ఉంటుందని, కుటుంబ మనుగడలో ఆడవాళ్ళ పాత్ర కీలకమని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Mudragada Padmanabham: జగన్ ఆదేశాలతో రంగంలోకి వైసీపీ నేతలు.. ముద్రగడకు హామీ