Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. రెండు పండుగలు ఒకేసారి..!
Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ నెల 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడం వల్ల ఆయన
- By Ramesh Published Date - 07:27 PM, Wed - 18 October 23

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ నెల 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడం వల్ల ఆయన నటిస్తున్న సినిమాల నుంచి టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 23న రిలీజ్ కాబోతున్న సలార్ పార్ట్ 1 నుంచి ఇప్పటివరకు ఫస్ట్ గ్లింప్స్ మాత్రమే వచ్చింది. సో ఆరోజున సలార్ (Salaar) నుంచి ఓ టీజర్ అది కూడా ప్రభాస్ డైలాగ్ ఉండేలా రిలీజ్ చేస్తారని టాక్. K.G.F తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ భారీ సినిమా మీద పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ నాగ్ అశ్విన్ (Nag Aswin) డైరెక్షన్ లో కల్కి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నుంచి కూడా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ వస్తుందని చెబుతున్నారు. కల్కి (Kalki) సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ అదరగొట్టగా కల్కి నుంచి మరో టీజర్ ఆశిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
Also Read : Bigg Boss 7 : ఆమె రీ ఎంట్రీ వల్ల లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?
సో అక్టోబర్ 23న రెబల్ ఫ్యాన్స్ కి రెండు భారీ కానుకలు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాదు 40 ప్లస్ అయిన ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. మరి ఈ బర్త్ డే తర్వాత అయినా పెళ్లి గురించి ప్రభాస్ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా లేదా అన్నది చూడాలి. బాహుబలి రిలీజ్ ముందు నుంచి పెళ్లెప్పుడు అంటే చేస్తున్న సినిమా తర్వాత అంటూ ఆ తర్వాత కూడా నాలుగైదు సినిమాలు చేశాడు ప్రభాస్.
ప్రభాస్ పెళ్లి విషయంలో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి ప్రభాస్ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూడాలి. నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకోవాల్సిందే అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.