Harish Shankar : త్రివిక్రం మా ఇంట్లో పెద్ద కొడుకు..!
రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా మాస్ ఆడియన్స్ కు
- By Ramesh Published Date - 07:54 AM, Tue - 20 August 24

Harish Shankar టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈమధ్యనే మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా నిర్మించగా సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా మాస్ ఆడియన్స్ కు బాగా ఎక్కేశాయి. ఐతే రిలీజ్ ముందు బాగా హడావిడి చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
పోటీగా వచ్చిన పూరీ రామ్ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఐతే హరీష్ శంకర్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత కూడా సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రం పై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. సినిమాలో గురూజీ అని ఒక పాత్రని పెట్టడం తో త్రివిక్రం టార్గెట్ తోనే హరీష్ శంకర్ అలా చేశాడన్న టాక్ ఉంది.
దీనికి ఆన్సర్ ఇస్తూ హరీష్ శంకర్ సంచలన కామెంట్స్ చేశాడు. మా నాన్న త్రివిక్రం (Trivikram) కి పెద్ద ఫ్యాన్. నేను అసిస్టెండ్ డైరెక్టర్ గా చేరకముందే ఆయన రైటర్ గా నంది అవార్డులు తీసుకున్నారు. ఆయన నాకన్నా చాలా సీనియర్.. అంతేకాదు మా నాన్న ఆయనకు పెద్ద ఫ్యాన్. అతడు సినిమా చాలా సార్లు చూశారు. నువ్వు కూడా ఇలాంటి సినిమా తీయాలని అంటుంటారు. మా ఇంట్లో పెద్ద కొడుకు త్రివిక్రం అని అన్నారు హరీష్ శంకర్.
మీడియాలో వచ్చే వార్తలన్నిటిని పట్టించుకోకూడదని త్రివిక్రం తన కన్నా చాలా సీనియర్ తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎంతో గొప్ప నటులలో ఆయన ఒకరని అన్నారు హరీష్ శంకర్. సో గురూజీపై తను ఇచ్చిన క్లారిటీతో హరీష్ శంకర్ కు త్రివిక్రం పై ఉన్న అభిమానం ఎలాంటిదో అర్ధమవుతుంది.