HBD Trivikram : మాటల మాంత్రికుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
HBD Trivikram : తన మాట, ప్రాసతో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఆలోచింపజేసే సంభాషణలతో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట
- By Sudheer Published Date - 11:18 AM, Thu - 7 November 24

పంచ్ డైలాగ్ అయినా, సెంటిమెంటు డైలాగ్ అయినా, యాక్షన్ డైలాగైనా, కామెడీ డైలాగైనా ఇలా ఏ డైలాగైనా రాయాలన్న అది త్రివిక్రమ్ (Trivikram) తర్వాతే.. అందుకే ఆయన్ను మాటల మాంత్రికుడు అంటారు. అలాంటి మాటల మాంత్రికుడి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తూ వారి అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో 1971లో జన్మించిన ఈయన.. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చేసి, బంగారు పతకం సాధించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయిత వర్క్ చేసి తన మాటలతో అందరి మాయ చేసాడు.
ఇక నువ్వే నువ్వే తో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించి సినిమాలు ఇలా కూడా చేయొచ్చు అని నిరూపించాడు. ఆ తర్వాత అతడు , జులాయి, అత్తారింటికి దారేది, ఖలేజా , సన్ అఫ్ సత్యమూర్తి , అఆ , అరవింద సమేత, గుంటూరు కారం , ఆలా వైకుంఠపురం లో ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసి తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. త్రివిక్రమ్ చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు.
ఒకటి రెండు మినహాయిస్తే తన సినిమాలన్నీ టాప్ హీరోలతోనే తీశారు. తన మాట, ప్రాసతో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఆలోచింపజేసే సంభాషణలతో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. తెరపైనే కాదు, వేదికలపైనా ఆయన మాటలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ కు మా “Hashtagu” తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తూ..మరిన్ని సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాలని కోరుకుంటున్నాం.
Read Also : Pushpa 2 : ‘పుష్ప 2’ కోసం రంగంలోకి దిగిన థమన్