Tributes to Superstar: సూపర్ స్టార్ కృష్ణకు ప్రముఖుల నివాళులు!
నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. నవంబర్ 15 ఉదయం 4:09 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
- By Balu J Published Date - 01:45 PM, Tue - 15 November 22

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. నవంబర్ 15 ఉదయం 4:09 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ మృతికి సినీ, రాజకీయ వర్గాలవారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సూపర్ స్టార్ రజినీ కాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సమంత, రవితేజ నివాళులు ప్రకటించారు.
వీరితో పాటు శ్రీను వైట్ల, జగపతి బాబు, అనిల్ రావిపూడి, సునీల్, వెన్నెల కిశోర్, థమన్, దేవి శ్రీ ప్రసాద్, శరత్ కుమార్, శ్రీకాంత్, సిమ్రాన్, అనుష్క, కార్తి, పూజా హెగ్డే, డింపుల్ హయతి ఇలా పలురంగాలకు చెందిన టెక్నీషియన్లంతా బాధాతప్త హృదయాలతో కృష్ణకి నివాళులర్పిస్తున్నారు. కృష్ణ మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత ఎమ్మెస్ రాజు, హీరో నిఖిల్ తదితరులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.