Venkatesh – Son In Law : విక్టరీ వెంకటేష్ రెండో అల్లుడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా ?
Venkatesh-Son In Law : హీరో విక్టరీ వెంకటేష్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం.
- Author : Pasha
Date : 18-03-2024 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
Venkatesh – Son In Law : హీరో విక్టరీ వెంకటేష్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం. ఆయన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి ఇటీవల జరిగింది.హయ వాహిని భర్త, వెంకటేష్ రెండో అల్లుడి పేరు నిశాంత్ పాతూరి. ఆయనొక డాక్టర్. మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిపుణుడు. చిన్న వయసులోనే నిశాంత్ (Venkatesh-Son In Law) డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి పేరు పీవీ రామారావు కూడా ప్రముఖ డాక్టరే. పీవీ రామారావు అని చెప్పడం కంటే.. ఆంధ్రా హాస్పిటల్స్ (విజయవాడ) డైరెక్టర్లలో ఒకరైన పీవీ రామారావు అంటే చాలామంది ఈజీగా గుర్తుపడతారు. సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఆయనను ఈజీగా గుర్తు పడతారు. ఆయన గొప్ప మనసును, ఆశయాన్ని మెచ్చుకుంటారు.
Also Read :NTR : వార్ 2లో ఎన్టీఆర్‌కి జోడిగా ఆ హీరోయిన్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..
పీవీ రామారావు సేవలకు హ్యాట్సాఫ్
వైద్య విద్యలో ఎండీ చేసిన పీవీ రామారావు విదేశాల్లో పలు పీజీలు, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. చిన్నారుల ప్రాణాలు కాపాడటం కోసం నిరంతరం ఆయన శ్రమిస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ (విజయవాడ)లో చిల్డ్రన్ సర్వీసెస్ విభాగం అధిపతిగా పీవీ రామారావు సేవలు అందిస్తున్నారు. నిరుపేద చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహాయ సహకారాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 76 మంది చిన్నారులకు ఆయన గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించారు. ఈ విధంగా ఏడేళ్లలో సుమారు మూడు వేలకు పైగా ఆపరేషన్లు చేశారు. పీవీ రామారావు, ఆంధ్రా హాస్పిటల్స్ చేస్తున్న సేవలు మహేష్ బాబుకు తెలియడంతో వాళ్ళతో చేతులు కలపడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join
పీవీ రామారావుకు హంగు ఆర్భాటాలు నచ్చవు. అందుకని అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో నిశాంత్ – హయ వాహిని పెళ్లిని జరిపించారు. ఇక మన విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే… ఆయన భార్య పేరు నీరజ. వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వెంకటేశ్ ఏకైక కుమారుడి పేరు అర్జున్. పెద్ద కుమార్తె పేరు ఆశ్రిత. ఈమె పెళ్లి 2019లోనే జరిగింది. ఆశ్రిత ఫుడ్ బ్లాగర్. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫుడ్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలయ్యారు. రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి ఇటీవల జరిగింది. ఆఖరి అమ్మాయి పేరు భావన.