Tollywood : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో
Tollywood : 'మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది' అంటూ ట్వీట్ చేశారు
- By Sudheer Published Date - 11:23 AM, Tue - 21 January 25

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి కాబోతున్నారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్ ను ఆగస్టు 22, 2024 న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ఎస్‌ఆర్ కళ్యాణ మండపంతోనే సూపర్ హిట్ కొట్టాడు. మధ్యలో వరుసగా కొన్ని ప్లాఫ్ లు ఎదురైనా ఈ మధ్యనే ‘క’ తో సూపర్ హిట్ అందుకొని తన సత్తా చాటాడు.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025