HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Hero Manchu Manoj Special Wishes His Wife Bhuma Mounika

Manchu Manoj: భార్య గురించి ఎమోషనల్ ట్వీట్ చేసిన మంచు మనోజ్.. నీ రెండేళ్ల ప్రేమ సరిపోదు అంటూ!

తాజాగా మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

  • Author : Anshu Date : 04-03-2025 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Manoj
Manchu Manoj

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే వస్తున్నాడు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీకి సంబంధించిన కాంట్రవర్సీలలో ఎక్కువగా మంచు మనోజ్ పేరు వినిపిస్తోంది. అప్పుడప్పుడు తన భార్య మౌనిక రెడ్డి విషయంలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు మంచు మనోజ్. రెండేళ్ల క్రితం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్.

గత ఏడాది ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించిన విషయం తెలిసిందే. 2023లో మార్చి మూడవ తేదీన వీరిద్దరి పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. తన సోదరీ మంచు లక్ష్మి నివాసంలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను టాలీవుడ్ నటుడు మంచు మోహన్‌ బాబు ఆశీర్వదించారు. ఇది ఇలా ఉంటే తాజాగా వీరి సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. రెండో వివాహా వార్షికోత్సవం వేళ మౌనికలో ఉన్న సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌ లో ఒక ఎమోషనల్ నోట్‌ రాసుకొచ్చారు.

 

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మౌనికను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. రెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నాను. నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను. మౌనిక నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నాకు తెలియని కొత్త ప్రేమను అందించావు. నేను విధిని నమ్మడానికి కారణం నువ్వు నా కష్టాల్లో నా వాయిస్‌ గా, గందరగోళంలో నా ప్రశాంతతగా నిలిచావు. కేవలం రెండేళ్లలో ప్రేమ, సంతోషం, నవ్వులతో ఇద్దరు అందమైన చిన్న పిల్లలతో ఇంటిని తీర్చిదిద్దావు. మన పిల్లల పట్ల ఒక తల్లిగా నీ అనంతమైన ప్రేమను చూసి ప్రతిరోజూ నీతో ప్రేమలో పడిపోతున్నాను. ఈ రెండేళ్లలోనే ఎన్నో ఎత్తులు, పతనాలు, విజయాలు, పోరాటాలను ఎదుర్కొన్నాను. కానీ వీటన్నింటిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉంది. అదే మనం. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు అతిపెద్ద సపోర్టర్‌. ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు.. నా జీవితకాలం సరిపోదు. హ్యాపీ వార్షికోత్సవ శుభాకాంక్షలు మున్నీ. మన కలలు, సాహసాలు, ప్రేమ, సమయంతో పాటు మరింత బలంగా పెరుగుతుంది. ఇట్లు నీ మను అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే అంతకంటే ముందే మౌనిక సోషల్ మీడియా వేదికగా తన భర్త మంచు మనోజ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhuma Mounika
  • manchu manoj
  • post viral
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd