Tiger Nageswara Rao : టైగర్ ఇప్పుడు కత్తిరించి ఏం లాభం..?
Tiger Nageswara Rao మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్
- By Ramesh Published Date - 10:28 PM, Sat - 21 October 23

Tiger Nageswara Rao మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మించారు. స్టూవర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా స్పూర్తితో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ (Raviteja) టైగర్ నాగేశ్వర రావు పాత్రలో కనిపించారు. రవితేజ వరకు సినిమాలో అదరగొట్టేయగా కథ కథనాలు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. అదీగాక ఈ సినిమాకు 3 గంటల రన్ టైం (Runtime) కూడా సినిమా ఫలితం మీద ఎఫెక్ట్ పడేలా చేసింది.
అందుకే రిలీజైన మరిసటి రోజే నష్ట నివారణ చర్యలు చేపట్టారు మేకర్స్. సినిమాను 3 గంటల నుంచి 20 నిమిషాల రన్ టైం ట్రిం చేశారు. అంటే ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు రన్ టైం ని 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. అయితే ఆల్రెడీ సినిమా టాక్ బయటకు వచ్చాక ఇప్పుడు ఎంత రన్ టైం కట్ చేసినా సరే లాభం ఉండదు.
కానీ మేకర్స్ మాత్రం రన్ టైం కట్ చేసి రవితేజ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయాలని చూస్తున్నారు. టైగర్ నాగేశ్వరావు సినిమా టాక్ డివైడ్ గా నడుస్తుంది. అయితే ఈ రన్ టైం కుదించడం వల్ల సినిమాకు ఎంతమేరకు లాభం జరుగుతుంది అన్నది చూడాలి. రవితేజ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకోగా సినిమా రిజల్ట్ మాత్రం అతన్ని నిరాశపరచింది.
Also Read : Payal Rajput Mangalavaram : పాయల్ రాజ్ పుత్ కి కలిసి వచ్చేలా మంగళవారం..!