Three Heroines: ముగ్గురు హీరోయిన్స్ తో వెంకీమామ రొమాన్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
చిరంజీవి, బాలయ్య లాంటి సూపర్‌స్టార్ లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
- By Balu J Updated On - 05:04 PM, Sat - 4 March 23

హాలీవుడ్ (Hollywood) లో 55 లేదా 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ హీరోలు సాధారణంగా వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తుంటారు. అయితే ఇక్కడ తెలుగులో మాత్రం చిరంజీవి, బాలయ్య లాంటి సూపర్‌స్టార్‌లను ఇప్పటికీ ఆ యంగ్ లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నారని సినీ ప్రేమికులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక తమ వయసులో సగం లోపు ఉన్న హీరోయిన్లను ఎంచుకున్నారంటూ మరీ ట్రోల్ చేస్తున్నారు. సీనియర్ స్టార్లలో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh) అసురన్ రీమేక్, దృశ్యం రీమేక్ వంటి చిత్రాలలో ప్రశంసలు అందుకున్నాడు.
ఇద్దరి ఇద్దరు పిల్లలకు తండ్రిగా కూడా కనిపించాడు. అయితే, HIT మూవీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సైంధవ్ మూవీని వెంకీ ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నట్టు టాక్. దీనిపై క్లారిటీ లేకపోయినప్పటికీ, ఇదే జరిగితే వెంకటేష్ ట్రోల్ అయ్యే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రానా నాయుడు సిరీస్‌లో అతని బోల్డ్ రోల్ లో (Venkatesh) యాక్ట్ చేయడం ఆశ్చర్యపర్చింది. మరి సైంధవ్ మూవీలో ముగ్గురు హీరోయిన్ల ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతానికి, ఈ ముగ్గురు హీరోయిన్ల గురించి విన్న ప్రతి ఒక్కరూ ‘అయ్యో చాలా ఎక్కువ’ అని ఫీలవుతున్నారు.
Also Read: Pushpa2 Theatrical Rights: తగ్గేదేలే.. పుష్ప2 ‘థియేట్రికల్ రైట్స్’ 1000 కోట్లు?

Related News

Rashmika Mandanna: ఆ హీరోనే నా ప్రేమికుడు: ఫ్యాన్స్ చిట్ చాట్ లో రష్మిక మందన్న
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మరోసారి అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది.