Upcoming Movies: ఈవారం ఓటీటీలో సందడి మాములుగా లేదుగా.. ఏకంగా 29 సినిమాలు?
Upcoming Movies: ప్రతివారం థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా సినిమాల హవా బాగా ఉంది. చాలామంది ప్రేక్షకులు కూడా థియేటర్లో కంటే ఓటీటీ లో చూడటానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
- By Nakshatra Published Date - 06:06 PM, Mon - 27 March 23
Upcoming Movies: ప్రతివారం థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా సినిమాల హవా బాగా ఉంది. చాలామంది ప్రేక్షకులు కూడా థియేటర్లో కంటే ఓటీటీ లో చూడటానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ లో సినిమాలు సందడి చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఏకంగా 29 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంతకు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
అవతార్ 2, అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు, సత్తి గాని రెండెకరాలు ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక హిందీలో షెహజాదా, గ్యాస్ లైట్ కూడా విడుదల కానున్నాయి. గోదారి అనే డాక్యుమెంటరీ కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక వీటితో పాటు వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇక అవేంటంటే.. నెట్ ఫ్లిక్స్ లో మై లిటిల్ పోనీ – టెల్ యువర్ టేల్ అని ఇంగ్లీష్ సిరీస్ మార్చి 27,
ఎమర్జెన్సీ – ఎన్ వైసీ అనే ఇంగ్లీష్ సిరీస్, అన్ సీన్ అనే ఇంగ్లీష్ సిరీస్ మార్చి 29న, ఫ్రమ్ మీ టూ యూ – కిమీ నీ తోడోకే అనే కొరియన్ సిరీస్ మార్చి 30న, ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ అనే హిందీ సిరీస్, కాపీ క్యాట్ కిల్లర్ అనే మాండరిన్ సిరీస్, కిల్ బోక్సూన్ అనే కొరియన్ సిరీస్, మర్డర్ మిస్టరీ 2 ఇంగ్లీష్ సిరీస్ లు మార్చి 31న విడుదల కానున్నాయి.
అమిగోస్ ఏప్రిల్ ఒకటి, జార్ హెడ్ త్రీ – ద సీజ్ అనే ఇంగ్లీష్ సిరీస్, కంపెనీ ఆఫ్ హీరోస్ అనే ఇంగ్లీష్ సిరీస్, షెహజాదా అనే హిందీ సిరీస్, స్పిరిట్ అన్ టెమ్డ్ అనే ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ ఒకటిన విడుదల కానున్నాయి. వార్ సెయిలర్ అనే ఇంగ్లీష్ సీరియస్ ఏప్రిల్ రెండున స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో గోదారి అనే తెలుగు డాక్యుమెంటరీ మార్చి 31, సత్తి గాని రెండెకరాలు సినిమా ఏప్రిల్ ఒకటిన విడుదల కానున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవతార్ 2 మార్చి 28, శ్రీదేవి శోభన్ బాబు మార్చి 30, డాగీ కమిలోహా ఎండి సీజన్ 2, గ్యాస్ లైట్, ఆల్ దట్ బ్రీత్స్ అనే సీరిస్ లు మార్చి 31న స్ట్రీమింగ్ కానున్నాయి. జి ఫైవ్ లో అగిలన్, అయోతి, యునైటెడ్ కచ్చే సిరీస్లో మార్చి 31న స్ట్రీమింగ్ కానున్నాయి. యాపిల్ టీవీ ప్లస్ లో టెట్రిస్ అనే ఇంగ్లీష్ సిరీస్ మార్చ్ 31న విడుదల కానుంది. బుక్ మై షో లో మమ్మీస్ మార్చి 27న, సన్ నెక్స్ట్ లో భగీరా మార్చి 31, ముబీ లో ప్లీజ్ బేబీ ప్లీజ్ మార్చి 31, ఎంఎక్స్ ప్లేయర్ లో ఇండియన్ సమ్మర్స్ మార్చి 27న స్ట్రీమింగ్ కానున్నాయి.
Tags
Related News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాల లిస్ట్
న్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు.