The Raja Saab : అక్టోబర్ 23న ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్
The Raja Saab : ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 06:27 PM, Sat - 21 September 24

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో (Prabhas-Maruthi Combination) తెరకెక్కుతోన్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab). హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు 50శాతం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ అక్టోబర్ 23న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సలార్ , కల్కి బస్టర్ విజయాల తర్వాత ప్రభాస్ బర్త్ డే రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ గ్రాండ్ గా వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజునే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల అప్‌డేట్స్ వచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో నటించనున్న నూతన చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్’ కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్.
Read Also : Tirumala Laddu Issue : ‘ఓకే శివయ్యా..’ అంటూ విష్ణు ట్వీట్ కు ప్రకాష్ రాజ్ రిప్లై