The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కాశ్మీర్ ఫైల్స్’
అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ది కాశ్మీర్ ఫైల్స్. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాలీవుడ్‌లో సంచలనం రేపింది.
- By Balu J Published Date - 05:44 PM, Wed - 16 March 22

అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ది కాశ్మీర్ ఫైల్స్. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీతో సహ సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. దేశం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది కూడా. ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నప్పటికీ, త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రీమియర్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాతలు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ప్రదర్శించడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒకవైపు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ, ప్రిమియర్ హక్కుల కోసం ఓటీటీతో డీల్ కుదుర్చుకున్నారు.