Bollywood: హీరోయిన్ కారు దగ్గరకు వచ్చి భిక్షాటన.. రూపాయి కూడా ఇవ్వని బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా తీరు వివాదాస్పదంగా మారింది. ఒక వికలాంగుడు వీర్ ఛైర్‌పై భిక్షాటన చేసుకుంటూ ఆమె కారు దగ్గరకు వచ్చాడు. సహాయం చేయాల్సిందిగా ఆమెను కోరాడు. కానీ ప్రీతి జింటా అస్సలు పట్టించుకోలేదు.
- By Anshu Published Date - 08:42 PM, Thu - 6 April 23

Bollywood: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా తీరు వివాదాస్పదంగా మారింది. ఒక వికలాంగుడు వీర్ ఛైర్‌పై భిక్షాటన చేసుకుంటూ ఆమె కారు దగ్గరకు వచ్చాడు. సహాయం చేయాల్సిందిగా ఆమెను కోరాడు. కానీ ప్రీతి జింటా అస్సలు పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రీతీజింటా తీరును పలువురు విమర్శిస్తున్నారు. అంత పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కనీసం వికలాంగుడికి కూడా సహాయం చేయకపోవడంపై పలువురు పెదవి విరిస్తున్నారు.
అయితే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బిజీలో వ్యక్తిని పట్టించుకోలేదని కొంతమంది చెబుతున్నారు. వీర్ ఛైర్‌ను తోసుకుంటూ ఒక వికలాంగుడు ఏదైనా సహాయం చేయకపోతుందా అని ప్రీతిజింటా కారు దగ్గరకు వెళ్లాడు. ప్లీజ్ మేడం ఎంతో కొంత సహాయం చేయండి అని కోరాడు. కానీ ప్రతీజింటా అతడిని పట్టించుకోకుండా రయ్యిమని కారులో వెళ్లిపోయింది. ఇది చూసి కొంతమంది ప్రీతిజింటాను తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కనీసం రూ.100 కూడా ఇవ్వలేదా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఆమెకు కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వికలాంగుడు ఎంత బాధపడి ఉంటాడో అంటూ కొంతమంది అంటు్నారు. కాగా ప్రస్తుతం సినిమాలకు ఆమె పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. బిజినెస్ వ్యవహారాల్లో ఎక్కువగా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ జట్టు యజమానురాలిగా ప్రీతిజింటా ఉంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లో స్టాండ్స్ లో తన జట్టుకు సపోర్ట్ చేస్తోంది. కింగ్స్ ఎలెవన్స్ జట్టు ఆడే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లోనూ స్టాండ్స్ లో ప్రీతిజింటా కనిపిస్తుంది. అయితే వివాదాలతో కూడా ప్రీతిజింటా ఎక్కువగా వార్తల్లో ఉంటూ ఉంటుంది. తాజాగా వికలాంగుడికి ఒక్క రూాపాయి కూడా సహాయం చేసిన ఆమె తీరు వివాదాస్పదంగా మారుతుంది.