Bheemla Nayak: పవన్ను కలిసిన తమన్..! వైరల్ అవుతోన్న పిక్…!!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్టోరీ అందించారు. ఈ మూవీ భారీ అంచనాలతో ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- By Hashtag U Published Date - 08:03 AM, Mon - 21 February 22
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్టోరీ అందించారు. ఈ మూవీ భారీ అంచనాలతో ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. అయితే భీమ్లానాయక్ మూవీ రిలీజ్ కు ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్…పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమన్ ను పవన్ హగ్ చేసుకున్నారు. ఈ ఫోటోను తమన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సోల్ ఫుల్ పర్సన్ నుంచి పవర్ ఫుల్ హాగ్…శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను కష్టపడి పనిచేసేలా ప్రోత్సహించారు…నా ప్రియమైన మేధావి శ్రీ త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు అంటూ ట్విట్ చేశారు తమన్. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.
ఇక ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ తనకు ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మరో ప్రధాన పాత్రలో రానా యాక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను రాబడుతుందో వేచి చూడాల్సిందే.
#Powerful HUG 🤗 From a #Soulful ♥️Person Shri @PawanKalyan Gaaru Makes U Work Even More Harder Made Me Even More Stronger💪🏼
Thanks to My dear Dir the Genius Shri #Trivikram gaaru fr Making this Happen fr Me in this life & He clicked this Picture too ♥️#BheemlaNayakOnFeb25th pic.twitter.com/rfa7TDnOKK
— thaman S (@MusicThaman) February 20, 2022
Related News
AP : లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు – పవన్ కళ్యాణ్
అసెంబ్లీలో చర్చ లేకుండానే లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు