Thalapathi Vijay : రజిని సినిమా చూసిన దళపతి విజయ్..!
Thalapathi Vijay రజిని సినిమాను దళపతి విజయ్ చూశారని తెలుస్తుంది. దానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్
- Author : Ramesh
Date : 11-10-2024 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
సూపర్ స్టార్ రజినికాన్ లీడ్ రోల్ లో టీ జే జ్ఞానవెల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా వేట్టయ్యన్. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చ, రానా, ఫాహద్ ఫాజిల్ లాంటి క్రేజీ స్టార్స్ కూడా నటించారు. జైలర్ లాంటి హిట్ కొట్టిన తర్వాత రజిని నుంచి వస్తున్న ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జైలర్ రేంజ్ లో లేదు కానీ రజిని మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించిందని అంటున్నారు.
ఐతే ఈ సినిమా చూసేందుకు కోలీవుడ్ స్టార్స్ సైతం ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా రజిని సినిమాను దళపతి విజయ్ చూశారని తెలుస్తుంది. దానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమిళ హీరోలందరికీ అభిమానమే. అందుకే వారెంత స్టార్ అయినా కూడా రజిని సినిమా వస్తే తప్పకుండా చూస్తారు.
దళపతి విజయ్ వేట్టయ్యన్..
సూర్య కంగువ సినిమా అసలైతే దసరా రేసులో దిగాల్సింది కానీ రజిని సినిమా వస్తుందని ఆ సినిమా వాయిదా వేసుకున్నారు. రజిని సినిమాను మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలని సూర్య అన్నారు. ఇప్పుడు దళపతి విజయ్ వేట్టయ్యన్ చూడటం కూడా రజినీ మీద ఆయనకున్న ప్రేమ వల్లే అని అంటున్నారు.
టీ జే జ్ఞానవేల్ జై భీమ్ తర్వాత చేసిన వేట్టయ్యన్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. తమిళ్ లో వేట్టయ్యన్ హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగులో కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరి రజినీ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారన్నది చూడాలి.
Also Read : Vettaiyan Collections : ‘వేట్టయాన్’ డే 1 కలెక్షన్లు