Hanuman Record TRP : బుల్లితెర మీద అదరగొట్టిన హనుమాన్.. స్టార్స్ ని వెనక్కి నెట్టేసిన తేజా సజ్జ..!
Hanuman Record TRP తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా హనుమాన్. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో రిలీజై ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ లో 350 కోట్ల
- By Ramesh Published Date - 10:44 PM, Thu - 9 May 24

Hanuman Record TRP టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా హనుమాన్. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో రిలీజై ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ లో 350 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత జీ 5 లో ఓటీటీ రిలీజ్ లో కూడా హనుమాన్ సత్తా చాటింది. థియేట్రికల్, ఓటీటీ అనుకున్న దాని కన్నా భారీ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకున్న హనుమాన్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా రికార్డు సృష్టించింది.
హనుమాన్ సినిమాను జీ తెలుగు ఏప్రిల్ 28న వరల్డ్ ప్రీమియర్ షో వేయగా ఈమధ్య కాలంలో స్టార్ సినిమాలకు కూడా రానటువంటి టీ.ఆర్.పి రేటింగ్ హనుమాన్ సినిమాకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం హనుమాన్ సినిమాకు 10.26 టి.ఆర్.పి వచ్చింది. ప్రభాస్ సలార్ సినిమాకు కూడా ఈ రేంజ్ రేటింగ్ రాలేదు.
హనుమాన్ తో రిలీజైన గుంటూరు కారం, నా సామిరంగ సినిమాలు కూడా 10 కి తక్కువగానే రేటింగ్ తెచ్చుకున్నాయి. లాస్ట్ ఇయర్ బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా 9.86 రేటింగ్ తో అదరగొట్టింది. ఇక ఇప్పుడు అది కూడా హనుమాన్ దాటేసింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వల్ గా జై హనుమాన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. 2025 లోనే జై హనుమాన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.
Also Read : Vijay Devarakonda Rashmika : రష్మికతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?