Tarakaratna : ఇంకా విషమంగానే.. తారకరత్న హెల్త్ బులిటెన్ ఇదే
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆయనకు అత్యవసర చికిత్స కొనసాగుతోందని తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
- By Balu J Published Date - 10:14 PM, Mon - 30 January 23

Tarakaratna Update: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆయనకు అత్యవసర చికిత్స కొనసాగుతోందని తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయనకు ప్రస్తుతం వెంటలేటర్ పై చికిత్స అందిస్తున్నారని ఆ బులిటెన్ లో స్పష్టం చేశారు. అయితే ఎక్మో లాంటి పరికరాలేవీ ఆయనకు అమర్చలేదని, ఆ ప్రచారం అంతా అవాస్తవం అని తేల్చి చెప్పారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని తెలిపారు.
రెండో బులిటెన్.. తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరుకి తరలించిన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని తెలుస్తోంది. మెదడుకి సంబంధించి రక్త ప్రసరణ ఆగిపోవడంతో ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటూ మొదటగా ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అప్పటికీ ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం విషయంలో ఏమాత్రం పురోగతి లేదని మాత్రం తెలుస్తోంది.