Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యాపారవేత్త ఇతనే..!!
స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
- By Gopichand Published Date - 09:42 AM, Thu - 17 November 22
స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై తమన్నా స్పందించింది. తాను పెళ్లి చేసుకోబోయే ముంబై వ్యాపారవేత్త ఇతనే అని ‘F3’సినిమాలో మగాడి వేషంలో ఉన్న తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని అర్థమొచ్చేలా దానికి #MarriageRumoursఅనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.
హీరోయిన్ తమన్నాకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆమె పెళ్లి వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి నటి త్వరలో పెళ్లి చేసుకోవచ్చని బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త ఆమెకు ప్రపోజ్ చేయగా తమన్నా ఓకే చెప్పిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త వైరల్ కావడంతో తమన్నా తన పెళ్లి వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆమె సమాధానమిచ్చిన శైలి చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫన్నీ వీడియోను పంచుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే ముంబై వ్యాపారవేత్త ఇతనే అని ‘F3’సినిమాలో మగాడి వేషంలో ఉన్న తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని స్పష్టం చేసింది.
తమన్నా వివాహం గురించి తప్పుడు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా జరిగింది. ఆ సమయంలో తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను వివాహం చేసుకోబోయే విషయం తన తల్లిదండ్రులకు వదిలేసినట్లు పేర్కొంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో మెగా స్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇది కాకుండా తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, మలయాళ చిత్రం బాంద్రాలో కనిపించనుంది.
Tags
Related News
LS Polls: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ నటి.. చేవేళ్ల బరిలో పోటీ!
LS Polls: నిస్సందేహంగా ఎన్నికల సీజన్ టాలీవుడ్ పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తెలుగు నటులు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుగు యువ నటి సాహితి దాసరికి సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగులో పుట్టిన ఈ భామ ‘పొలిమెరా’, ‘మా ఊరి పొలిమెర 2’ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురు చూడడమే కాకుండా రాజకీ�