Kalki 2898 AD : కల్కి ఫస్ట్ సాంగ్ అప్డేట్.. ట టక్కర టక్క టక్కర…
కల్కి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చింది. ట టక్కర టక్క టక్కర.. అంటూ సరిగమ మ్యూజిక్ సంస్థ ఓ అప్డేట్ ని ఇచ్చింది.
- By News Desk Published Date - 04:22 PM, Thu - 16 May 24

Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్.. వంటి టాప్ స్టార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. జూన్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కి ఒక నెల మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ సినిమా ఆడియో రైట్స్ ని ‘సరిగమ’ మ్యూజిక్ సంస్థ దక్కించుకుందట. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ సరిగమ సంస్థ తమ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేసింది. ఇప్పుడే ‘ట టక్కర టక్క టక్కర.. టక్కర టక్కర టా’ సాంగ్ ని విన్నాము. ఆ సాంగ్ మీరు వినాలంటే మీరు ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందే.. అంటూ మ్యూజిక్ బిట్ ని షేర్ చేసారు. ఈ నెలలోనే ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారట. ఈ సాంగ్ కేవలం ప్రమోషన్స్ కి సంబంధించినదని, మూవీలో ఈ పాట ఉండదని తెలుస్తుంది. ఈ సినిమా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
Vibin’ just 𝐓𝐚 𝐓𝐚𝐤𝐤𝐚𝐫𝐚 𝐓𝐚𝐤𝐤𝐚 𝐓𝐚𝐤𝐤𝐚𝐫𝐚… 𝐓𝐚𝐤𝐤𝐚𝐫𝐚 𝐓𝐚𝐤𝐤𝐚𝐫𝐚 𝐓𝐚𝐚..! as hard as our darling 🕺 for the thrill awaiting for you🥳🤩 pic.twitter.com/E7iw3jThmx
— Saregama South (@saregamasouth) May 16, 2024
Embarking on a musical journey into the future with @saregamasouth 🎶 #Kalki2898AD
Music by @Music_Santhosh 🥁@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal #Kalki2898ADonJune27 pic.twitter.com/lQHOgwcZqs
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 16, 2024
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రిలీజ్ కంటే ముందే కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రానుందట. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయనున్నారట. ఒక్కో ఎపిసోడ్ 20 నిముషాలు పైనే ఉంటుందట. ఈ వెబ్ సిరీస్ ముగింపు.. కల్కి మూవీకి మొదలంట. మే 25 తరువాత ఈ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.