Surya Kanguva : సూర్య కంగువ రన్ టైం.. క్లవర్ డెసిషన్..!
Surya Kanguva ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు 3 గంటల రన్ టైం తో సినిమాను వదులుతున్నారు. ఐతే అవన్ని సక్సెస్ అవుతున్నా మొదటి టాక్
- By Ramesh Published Date - 11:59 AM, Tue - 15 October 24

కోలీవుడ్ స్టార్ సూర్య లీడ్ రోల్ లో శివ (Siva) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కంగువ. ఈ సినిమాను అసలైతే అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకోగా ఆ టైం కు సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా వస్తుందని కంగువని వాయిదా వేశారు. నవంబర్ 14న కంగువ రిలీజ్ లాక్ చేశారు. తమిళంతో పాటుగా తెలుగులో కూడా భారీగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తున్నారు.
ముఖ్యంగా ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు 3 గంటల రన్ టైం తో సినిమాను వదులుతున్నారు. ఐతే అవన్ని సక్సెస్ అవుతున్నా మొదటి టాక్ మాత్రం డిఫరెంట్ గా వస్తుంది. అందుకే ఆ ఎక్స్ పీరియన్స్ చూసిన కంగువ (Kanguva) టీం సినిమాను రెగ్యులర్ సినిమాల రన్ టైం లోనే ఉండేలా జాగ్రత్త పడ్డారత. సూర్య (Surya) కంగువ సినిమా రన్ టైం ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా 2 గంటల 25 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది.
కంగువ సినిమా కొత్త వరల్డ్ లో..
రెండున్నర గంటల సినిమాను ఎలా ఉన్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఐతే కంగువ సినిమా కొత్త వరల్డ్ లో తెరకెక్కించారు. దాన్ని రెండున్నర గంటల్లో చెప్పడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా విషయంలో సూర్య చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.
సూర్య కంగువ తెలుగు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. సినిమాను తెలుగులో సోలోగా రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుంది. మరి సూర్య కంగువ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read : King Nagarjuna : నాగార్జునని తక్కువ అంచనా వేయకండి..!