Supritha : భయపడిన సురేఖవాణి కూతురు సుప్రీత.. సారి చెప్తూ వీడియో పోస్ట్..
తాజాగా నిన్న హోలీ రోజు సుప్రీత సారీ చెప్తూ పెట్టిన వీడియో పోస్ట్ వైరల్ గా మారింది.
- By News Desk Published Date - 11:34 AM, Sat - 15 March 25

Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి కూతురు సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయింది. తాజాగా నిన్న హోలీ రోజు సుప్రీత సారీ చెప్తూ పెట్టిన వీడియో పోస్ట్ వైరల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ తో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఇన్ ఫ్లూయన్సర్స్ సోషల్ మీడియాలో వాళ్లకు డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఒకర్ని అరెస్ట్ చేసారు. మరొకర్ని అరెస్ట్ చేయాలి అనుకుంటే తప్పించుకు తిరుగుతున్నారు.
ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై నిఘాపెట్టి గట్టిగా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీత తో కూడా మాట్లాడటంతో ఆమె వీడియో పోస్ట్ చేసింది.
సుప్రీత తను షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. కొంతమంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. గతంలో నేను కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను. అందుకు సారీ. ఇకపై అలాంటివి చేయను. ఎవరైనా ఇన్ ఫ్లూయన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఆపేయండి అని తెలిపింది.
అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళని అరెస్ట్ చేస్తుండటం, నోటీసులు ఇస్తుండటంతో సజ్జనార్ చెప్పగానే తనదాకా వస్తుందేమో అని ముందుగానే సుప్రీత భయపడి సారీ చెప్తూ ఈ వీడియో పోస్ట్ చేసింది అని భావిస్తున్నారు.
Also Read : Geetu Royal : మహానటి సావిత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ భామ.. ఆవిడ అలా చేయొచ్చా?