Geetu Royal : మహానటి సావిత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ భామ.. ఆవిడ అలా చేయొచ్చా?
తాజాగా బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న గీతూ రాయల్ సావిత్రిపై మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
- By News Desk Published Date - 11:13 AM, Sat - 15 March 25

Geetu Royal : మహానటి సావిత్రి ఎన్నో సినిమాలతో, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి చివరి దశలో మాత్రం ఏమి లేకుండా ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో దీన మరణం పొందారు. ఆమె గురించి ఇప్పటి జనరేషన్ కి మహానటి సినిమా ద్వారా కొంత తెలిసింది. అయితే ఆమె గొప్ప నటి, మంచి మనిషి అయినా పర్సనల్ లైఫ్ లో మాత్రం తప్పు చేసిందని చాలా మంది భావిస్తారు.
తాజాగా బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న గీతూ రాయల్ సావిత్రిపై మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గీతూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా పెళ్ళైన వాళ్ళని ప్రేమించకండి అనే దానిపై మాట్లాడింది. తనకి ఏమైనా అనుభవం అయిందో లేక తనకి తెలిసిన వాళ్లకు అనుభవం అయిందో తెలీదు కానీ దీని గురించి మాట్లాడుతూ సావిత్రిని ఉదాహరణకు తీసుకుంది.
గీతూ రాయల్ తన వీడియోలో మాట్లాడుతూ.. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్ళ జోలికి కానీ, పెళ్ళైన వాళ్ళ జోలికి కానీ అస్సలు వెళ్లొద్దు. మహానటి సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. సావిత్రమ్మ చాలా గొప్పది. కానీ పెళ్లయి పిల్లలు ఉన్నారు అని తెలిసినా జెమిని గణేశన్ ని పెళ్లి చేసుకుంది. ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే. ఆవిడ మాత్రం వేరే ఆమె భర్తని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆవిడ మాత్రం ఆయన్ని వేరే అమ్మాయితో చూస్తే తట్టుకోలేదు. కర్మ అనేది బూమ్ రాంగ్ లాంటిది. ఆమె ఏదైతే చేసిందో ఆమెకు అదే తిరిగి వచ్చింది. మీ లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. ఒకరు మీ కోసం వేరే వాళ్ళని వదిలేస్తున్నారంటే రేపు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తారు జాగ్రత్త అంటూ తెలిపింది.
దీంతో గీతూ రాయల్ పై విమర్శలు వస్తున్నాయి. నీ కొటేషన్స్ నువ్వు చెప్పుకో మధ్యలో సావిత్రమ్మ లైఫ్ ఎందుకు, ఆవిడ పర్సనల్ విషయాలు నీకెందుకు, సావిత్రి గారిని జడ్జ్ చేసే స్థాయిలో ఉన్నావా అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు గీతూ ఏం చెప్పాలి అనుకుందో, మధ్యలో సావిత్రి గారిని ఎందుకు తీసుకొచ్చిందో ఆమెకే తెలియాలి.
Also Read : Court Collections : అదరగొట్టిన చిన్న సినిమా.. ‘కోర్ట్’ కలెక్షన్స్ ఓ రేంజ్ లో..