Surekha Konidala : పవన్ కళ్యాణ్ ఏది పెడితే అది తినేసేవాడు – సురేఖ
- By Sudheer Published Date - 03:20 PM, Sat - 9 March 24

ఉమెన్స్ డే ( Women’s Day) సందర్బంగా చిరంజీవి సతీమణి సురేఖ (Surekha Konidala)..ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు తినే ఆహారం గురించి చెప్పుకొచ్చింది. మా మామయ్య గారు మాత్రం మంచి బోజన్ ప్రియలు.. అన్ని ప్లేట్ లో పెట్టుకొని అన్నింటిని టేస్ట్ చేస్తూ సంపూర్ణ భోజనం చేసేవారు. ఇక పెళ్లైన కొత్తలో నాకు వంట చేయడం వచ్చేది కాదు. మా అత్తమ్మ చాలా బాగా వండి పెట్టేది. కానీ చిరంజీవి గారికి మాత్రం నేను వంట చేస్తే తినాలని కోరికగా ఉండేది. కానీ వంట చేయడం రాదు దాంతో ఒకరోజు తెగించి ఉప్మా చేశాను అది చాలా గట్టిగా వచ్చింది. దాంతో కొద్దిరోజుల దాకా మరోసారి వంట చేయడం ఆపేసాను. ఇక దాంతో మా ఆయన నేను నిరుత్సాహ పడకూడదని తనే నాకు దగ్గరుండి మరి వంట నేర్పించారు. ఆయన చాలా బాగా వంట చేస్తారు. నా గురువు కూడా చిరంజీవి గారే కావడం విశేషం అని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
చిరంజీవి తినే విషయంలో అసలు ఏమి పట్టించుకోడని, పచ్చడ ఉన్న కూడా దాంతో తినేస్తాడని ఆయనకు స్పెషల్ గా ఇదే కావాలి అని ఏది లేదు. తినే టైంలో ఏది ఉంటే దాంతో తినేస్తూ సర్ది పెట్టుకుంటాడు . అలాగే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ల అన్నయ్య లాగే ఏది ఉంటే దాంతో తినేస్తాడు అంతే తప్ప ఇది ఉంటేనే తింటాను అది లేకపోతే తినను అని కండిషన్స్ ఏం పెట్టడు అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటె రీసెంట్ గా సురేఖ గారు ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రయాణికులకి ఇంటి భోజనం అందించడం కోసం ఆమె ‘అత్తమ్మాస్ కిచెన్’ను (Athamma’s Kitchen) స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి మన దేశంలో దీన్ని లాంఛ్ చేశారు. కానీ త్వరలోనే దీని సేవలను అమెరికాలో కూడా విస్తరించాలని భావిస్తున్నారట. ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. దక్షిణ భారతీయ వంటకాలతో పాటు సరికొత్త రెసిపీలను అత్తమ్మాస్ కిచెన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. త్వరలోనే ఈ బిజినెస్‌ను మరింత విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
Read Also : Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి మరో బ్యానర్..