Tollwood Stars: సమ్మర్ ఎఫెక్ట్.. విదేశాల్లో చిల్ అవుతున్న మహేశ్, రామ్ చరణ్
- Author : Balu J
Date : 02-04-2024 - 12:11 IST
Published By : Hashtagu Telugu Desk
Tollwood Stars: భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఇక హైదరాబాద్‌లో గత వారం రోజులుగా అత్యధికంగా టెంపరేచర్ ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దంచికొడుతున్న ఎండలకు భయపడిపోతున్నారు. ఇక ఎండ వేడిమిని టాలీవుడ్ స్టార్స్ వెకేషన్ కు వెళ్తున్నారు. ప్రస్తుతం రాజమౌళితో తన తదుపరి చిత్రం జూన్ లేదా జూలైలో ప్రారంభం అయ్యే వరకు మహేష్ బాబు స్విస్ లో చిల్ అవుతున్నాడు.
అతని భార్య, పిల్లలతో పాటు ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని విలాసవంతమైన రిసార్ట్ లో సమ్మర్ హాలీడే స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బ్యాంకాక్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని భార్య ఉపాసన, వారి కుమార్తె కలిసి సమ్మర్ సెలవులను ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్ తన స్నేహితుల బృందంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లగా, ఈ నెలాఖరులో “గేమ్ ఛేంజర్” షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయనున్నాడు. మహేశ్, చరణ్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.