Ambajipeta Marriage Band Collections : అంబాజీపేట బాక్సాఫీస్ దూకుడు.. రెండు రోజుల్లో సుహాస్ సినిమా ఎంత రాబట్టింది అంటే..?
Ambajipeta Marriage Band Collections సుహాస్ లీడ్ రోల్ లో నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా
- By Ramesh Published Date - 10:30 PM, Sun - 4 February 24

Ambajipeta Marriage Band Collections సుహాస్ లీడ్ రోల్ లో నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడంతో సినిమా మౌత్ టాక్ కూడా యాడై సూపర్ సక్సెస్ అయ్యిది.
ఈ క్రమంలో సినిమా మొదటి రెండు రోజుల్లో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన అంబాజీ పేటకు రెండు రోజుల్లో 5 కోట్ల కలెక్షన్స్ అంటే అది సామాన్యమైన విషయం కాదు.
కలర్ ఫోటో, రైటర్ పందభూషణ్ సినిమాలతో సక్సెస్ అందుకున్న సుహాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ద్య్శ్యంత్ కటికనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో ఫిదా శరణ్య కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. సుహాస్ కి శివాజి జంటగా నటించిన ఈ మూవీ ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.
సుహాస్ చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. లో బడ్జెట్ తో మంచి కంటెంట్ తో సుహాస్ చేస్తున్న ప్రతి అటెంప్ట్ బాగానే వర్క్ అవుట్ అవుతుంది. అంబాజీపేట సక్సెస్ తో సుహాస్ తన స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 2 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ తో అంబాజీప్ట దూసుకెళ్తుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టేలా ఉంది.
Also Read : People Media Factory : అక్కడ హిట్టు ఖాతా తెరిసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..!