Bigg Boss Subhashree : ప్రొడ్యూసర్ తో పెళ్లికి సిద్దమైన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Subhashree : ఈ పాట షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ ప్రేమను వివాహ బంధంతో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి వేడుక జూలై నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్నట్లు తెలుస్తోంది.
- By Sudheer Published Date - 09:02 AM, Sat - 7 June 25

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో ప్రేక్షకులను ఆకట్టుకున్న శుభశ్రీ (Bigg Boss 7 Subhashree Rayaguru ) తన జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లారు. ఆమె ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్తో (Ajay) నిశ్చితార్థం (Ajay – Subhashree Rayaguru Engagement )జరుపుకున్నారు. జూన్ 5న హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో శ్రీదేవి-బోనీ కపూర్, జయసుధ-నితిన్ కపూర్ లా, శుభశ్రీ కూడా ఓ బాలీవుడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నిర్మాతను జీవన భాగస్వామిగా ఎంచుకోవడం విశేషం.
Corona : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా..ఎక్కువ ప్రభావం ఏ అవయవంపై పడుతుందో తెలుసా..?
ఈ వేడుక సందర్భంగా అజయ్ మైసూర్-శుభశ్రీ కలిసి రూపొందించిన “మెజెస్టీ ఇన్ లవ్” అనే పాటను విడుదల చేశారు. సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ పాటకు సిద్ధార్థ్ వాట్కిన్స్ సంగీతం అందించగా, సాహితి చాగంటి వాయిస్‌తో గానం చేశారు. ఈ పాట షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ ప్రేమను వివాహ బంధంతో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి వేడుక జూలై నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్నట్లు తెలుస్తోంది.
Banakacherla Project : దయచేసి తెలంగాణ అర్థం చేసుకోవాలి – నిమ్మల రామానాయుడు
నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న నటుడు సాయికుమార్ మాట్లాడుతూ “అజయ్ నా స్నేహితుడు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరి జీవితం ఆనందంగా ఉండాలి” అన్నారు. అలాగే నటుడు సోహైల్‌తో పాటు బిగ్‌బాస్ నుండి పలువురు కంటెస్టెంట్లు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. నిర్మాతగా అజయ్ మైసూర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”, “10th క్లాస్ డైరీస్” వంటి చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే.