Mahesh Babu : ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు ఫారిన్ వెకేషన్.. లుక్‌లో చిన్న చేంజ్..
ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు ఫారిన్ వెకేషన్ బయలుదేరారు. నెట్టింట వైరల్ అవుతున్న మహేష్ బాబు లుక్స్.
- By News Desk Published Date - 11:35 AM, Fri - 14 June 24

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా SSMB29 కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతుంది. దీంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మొత్తం టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఎంతో ఆసక్తి నెలకుంది. ఈ ఏడాది మొదటిలో గుంటూరు కారం సినిమాని రిలీజ్ చేసిన మహేష్ బాబు.. మరో మూవీకి సైన్ చేయలేదు. తన పూర్తి కాల్ షీట్స్ రాజమౌళి సినిమాకే ఇచ్చేసారు.
అయితే రాజమౌళి ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లోనే ఉన్నారు. దీంతో మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇక ఈ గ్యాప్ లో బాడీ ఫిట్‌నెస్, మూవీ లుక్స్ పై ఫోకస్ పెట్టి మహేష్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి ట్రిప్ లు వేస్తూ.. ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మహేష్ తన కుటుంబంతో కలిసి ఫారిన్ వెకేషన్ కి బయలుదేరారు. నమ్రత, గౌతమ్, సితారతో కలిసి మహేష్.. నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెకేషన్ కి బయలుదేరారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోల్లో మహేష్ లుక్స్ ని గమనిస్తే.. ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది. మొన్నటి వరకు లాంగ్ హెయిర్, కొంచెం ఎక్కువ గడ్డంతో కనిపించిన మహేష్ బాబు.. ఇప్పుడు గడ్డంని కొంచెం ట్రిమ్ చేసారు. జుట్టుని మాత్రం అలాగే ఉంచారు. మరి ఫైనల్ గా SSMB29లో మహేష్ ఎలాంటి లుక్స్ లో దర్శనం ఇస్తారో చూడాలి. అలాగే ఈ మూవీని ఎప్పుడు మొదలు పెట్టనున్నారు..? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.
#TFNExclusive: Super🌟 @urstrulyMahesh and his family are off for a small vacation!📸#MaheshBabu #NamrataShirodkar #GautamGhattamaneni #SitaraGhattamaneni #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/VTV357R3NS
— Telugu FilmNagar (@telugufilmnagar) June 14, 2024