RRR Movie: ఆర్ఆర్ఆర్ కు అరుదైన గుర్తింపు.. ‘బెస్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్ అవార్డు’ కైవసం!
రాజమౌళి దర్శకత్వం వహించిన RRR 50వ సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది.
- By Balu J Published Date - 03:18 PM, Wed - 26 October 22

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR 50వ సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్. బెస్ట్ డైరెక్టర్‌తో సహా పలు విభాగాల్లో నామినేట్ చేయబడింది. అయితే సన్మానాన్ని స్వీకరించడానికి రాజమౌళి స్వయంగా అక్కడ లేకపోవడంతో AV ప్లే చేయబడింది. “మా చిత్రం RRR ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో సాటర్న్ అవార్డును గెలుచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మా మొత్తం టీమ్ తరపున నేను జ్యూరీకి ధన్యవాదాలు. మేం చాలా ఉప్పొంగిపోయాం. ఇది నాకు రెండవ సాటర్న్ అవార్డు కూడా. బాహుబలి: ది కన్‌క్లూజన్ తో నాకు అవార్డు వరించింది. నేను వ్యక్తిగతంగా అక్కడ ఉండాలనుకుంటున్నాను. కానీ జపాన్‌లో RRR ప్రమోషన్‌లకు సంబంధించి నా ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా నేను హాజరు కాలేకపోయాను. మిగతా విజేతలందరినీ నేను అభినందించాలనుకుంటున్నాను”అని రాజమౌళి రియాక్ట్ అయ్యాడు.
Congrats to #SaturnAwards Best International Film – @RRRMovie pic.twitter.com/CGf8zPdCqQ
— The Official Saturn Awards! (@SaturnAwards) October 26, 2022