SS Rajamouli Talks: హిట్ కాంబినేషన్ రిపీట్.. రామ్ చరణ్ ఎంట్రీ సీన్స్ కు గూస్ బంప్స్!
ఆర్ఆర్ఆర్ సక్సెస్ కొట్టిన మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 01:29 PM, Thu - 3 November 22

ఆర్ఆర్ఆర్ సక్సెస్ కొట్టిన మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ నుంచి రాంచరణ్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. శంకర్ భారతీయుడు-2 సినిమాతో బిజీగా ఉండటంమే అందుకు కారణం. తాజాగా మరో వార్త వైరల్ గా మారింది. అయితే రామ్ చరణ్ నెక్ట్ మూవీ కోసం దర్శకుడు సుకుమార్‌తో కలిసి పనిచేస్తున్నాడని టాలీవుడ్ టాక్. సోషల్ మీడియాలో వెలువడిన క్లిప్‌లో SS రాజమౌళి ఇంట్రస్టింగ్ న్యూస్ ను వెల్లడించాడు.
నెక్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా సుకుమార్ ఇప్పటికే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారని తెలియజేశారు. ఆ సీన్స్ చూస్తే ప్రేక్షకులు సీట్లలో కూర్చొలేరని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ అయ్యాయని తెలిపారు. “సుకుమార్, చరణ్ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ నాకు తెలుసు. సుకుమార్ టేకింగ్ బాగుందనీ, చరణ్ యాక్టింగ్ ను చూస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్‌లో క్లిప్‌ను పంచుకోవడం ప్రారంభించారు. సుక్కు, రామ్ చరణ్ కాంబో ఆర్ఆర్ఆర్ మూవీకి ముందే షూట్ అయ్యిందని మరో టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/MohanKuncha/status/1587663330122280961?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1587663330122280961%7Ctwgr%5E9521a0e51a9b045a2ff131f2975100d83416cb78%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Fentertainment%2Ftelugu-cinema%2Fss-rajamouli-talks-about-ram-charan-s-opening-sequence-from-sukumar-s-next-101667455391357.html