Janani : ఈ పాట ఆర్ఆర్ఆర్ కే హైలైట్.. జనని ఎమోషనల్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన ప్రతి సినిమా ఓ కళాఖండమే అని చెప్పక తప్పదు. ఆయన ఎంచుకునే స్టోరీలు.. తీసేవిధానం.. పాటలు.. ఫైట్లు.. ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ ప్రత్యేకమే.
- By Balu J Published Date - 03:54 PM, Fri - 26 November 21

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన ప్రతి సినిమా ఓ కళాఖండమే అని చెప్పక తప్పదు. ఆయన ఎంచుకునే స్టోరీలు.. తీసేవిధానం.. పాటలు.. ఫైట్లు.. ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ ప్రత్యేకమే. అందుకే రాజ్ మౌళి నుంచి సినిమా వస్తుందంటే తెలుగు అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తారు. అందుకు బాహుబలి సినిమాయే గొప్ప ఉదాహరణ. టాలీవుడ్ సూపర్ స్టార్స్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రతిష్టాత్మకంగా తీసిన RRR మూవీ రిలీజ్ కు ముందే అందర్నీ ఆకట్టుకుంటోంది.
#Janani/#Uyire is the crux, heart and soul of #RRRMovie in its most heartfelt form…https://t.co/3r9SnHMuUG
Presenting #RRRSoulAnthem composed by the one and only @mmkeeravaani … Hope it stimulates your emotions and connects with with the true spirit of #RRRMovie.
— rajamouli ss (@ssrajamouli) November 26, 2021
తాజాగా ఆర్ఆర్ఆర్ టీం ఒక పాటను విడుదల చేసింది. ఆ పాట పేరు జనని. ఈ పాట ఎంతో భావోద్వేగంతో నిండినిది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆత్మ ఇందులో ప్రతిబింబిస్తుంది. మెలోడీగా సాగే ఈ గీతాన్ని శుక్రవారం రిలీజ్ చేశారు. కీరవాణి మ్యూజిక్ అందించిన పాటకు ఆయనే రాయడం విశేషం. ఇప్పటికే ‘‘నాటు’’ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ జనని పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి. RR జనవరి 7, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథ వి.విజయేంద్రప్రసాద్ కాగా, కె.కె. డిఓపిగా సెంథిల్ కుమార్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది ఈ మూవీ.
Related News

NTR : గోవాలో దేవర.. ఎన్టీఆర్ సినిమా ఏం జరుగుతుంది..?
NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా దేవర రెండు పార్టులుగా