Srileela Kurchi Madatapetti : కోలీవుడ్ హీరోతో కుర్చీ మడతపెట్టి స్టెప్పేసిన శ్రీలీల.. వీడియో వైరల్..!
Srileela Kurchi Madatapetti సూపర్ స్టార్ నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అసలు డ్యాన్స్ అంటేనే ఆమడ దూరం వెళ్లే మహేష్
- By Ramesh Published Date - 10:59 AM, Sun - 24 March 24
Srileela Kurchi Madatapetti సూపర్ స్టార్ నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అసలు డ్యాన్స్ అంటేనే ఆమడ దూరం వెళ్లే మహేష్ చేత కూడా విజిల్స్ వేయించేలా స్టెప్పులేశాడు శేఖర్ మాస్టర్. సరిలేరు నీకెవ్వరు సినిమా మైండ్ బ్లాక్ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ తన ప్రతి సినిమాలో శేఖర్ మాస్టర్ తో ఒక సాంగ్ కంపోజింగ్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో గుంటూరు కారం లో అన్ని సాంగ్స్ కి అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులేసి సర్ ప్రైజ్ చేశాడు.
గుంటూరు కారం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సాంగ్ ని చాలా మంది రీల్స్ కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ శ్రీ లీల కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో కుర్చీ మడతపెట్టి డ్యాన్స్ చేసింది. చెన్నై లో జరిగిన కల్చరల్ ఫెస్టియా 2024 ప్రోగ్రాం లో శ్రీలీల శివ కార్తికేయన్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా శ్రీలీలతో కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్ కు స్టెప్పులేశాడు శివ కార్తికేయన్.
Also Read : Nagarjuna : నాగార్జున మరో మల్టీస్టారర్ ప్లానింగ్..కుబేర తర్వాత ప్లాన్ అదుర్స్..!
ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల డ్యాన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక్క గుంటూరు కారమే కాదు శ్రీలీల సినిమాలో ఉంది అంటే డ్యాన్స్ అదిరిపోవాల్సిందే అనిపించేలా అమ్మడు చేస్తుంది. గుంటూరు కారం లో మరోసారి తన డ్యాన్స్ స్టామినా ప్రూవ్ చేసుకుంది శ్రీ లీల.