Samajavaragamana : శ్రీవిష్ణు కెరీర్లోనే సూపర్ హిట్ సినిమా.. 50 కోట్లు కలెక్ట్ చేసిన సామజవరగమన
తాజాగా వచ్చిన సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. జూన్ 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయిన సామజవరగమన సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.
- By News Desk Published Date - 10:30 PM, Fri - 21 July 23

శ్రీవిష్ణు(SreeVishnu) ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో కొత్త సినిమాలు ట్రై చేస్తూ ఉంటాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మంచి సినిమాలు ఇవ్వాలని చూస్తాడు శ్రీవిష్ణు. ఇక శ్రీవిష్ణు కామెడీతో కూడిన చేసిన సినిమా చేశాడు అంటే అది హిట్ అవ్వాల్సిందే. శ్రీవిష్ణు, రెబా మోనికా(Reba Monica) జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో AK ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా సామజవరగమన(Samajavaragamana).
తాజాగా వచ్చిన సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. జూన్ 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయిన సామజవరగమన సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా సామజవరగమన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక కలెక్షన్స్ కూడా మొదటి రోజు నుంచే భారీగా వచ్చాయి. చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది. మొదటి రోజు 4 కోట్లు వచ్చినా సినిమా హిట్ టాక్ రావడంతో గణనీయంగా కలెక్షన్స్ పెరిగాయి.
తాజాగా సామజవరగమన సినిమా 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. శ్రీవిష్ణు కెరీర్ లో 50 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా నిలిచి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా కూడా నిలిచింది. ఇక అమెరికాలో కూడా 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి శ్రీ విష్ణుకి అక్కడ కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. దీంతో శ్రీవిష్ణు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తనకి 50 కోట్ల సినిమా ఇచ్చినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపాడు.
Also Read : BRO Trailer : ఈ థియేటర్స్ లలో ‘బ్రో’ ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు