Sreeleela: ఛలో మూవీని మిస్ చేసుకొని, పెళ్లిసందడితో ఎంట్రీ ఇచ్చి!
ధమాకా మూవీతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.
- By Hashtag U Published Date - 05:30 PM, Thu - 29 June 23
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అంతకు ముందు ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో కనిపించినా కూడా శ్రీలీలకు అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చింది మాత్రం ధమాకా అనే విషయం తెల్సిందే. మొదటి సినిమా పెళ్లి సందడి నిరాశ పర్చిన కూడా అదృష్టం కొద్ది శ్రీలీలకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. బాలయ్య.. రామ్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అర డజను సినిమాలు ఉన్న విషయం అందరికి తెల్సిందే. హీరోయిన్ గా శ్రీలీల తెలుగు లో పెళ్లి సందడి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె తెలుగు సినీ రంగ ప్రవేశం మూడు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది అంటూ తాజాగా యంగ్ హీరో నాగ శౌర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
నాగ శౌర్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హిట్ మూవీ ఛలో కోసం మొదట శ్రీలీల ను సంప్రదించాం. ఆమె దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. కానీ చివరి నిమిషం లో శ్రీలీల నో చెప్పడంతో చేసేది లేక ఆ స్థానం లో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా చేయడం జరిగింది. రష్మిక కెరీర్ ఏ రేంజ్ లో దూసుకు పోతుందో మనకు తెల్సిందే. ఛలో మిస్ అయినా కూడా శ్రీలీల పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చి దూసుకు పోతుంది. ధమాకాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.
Also Read: BRS Fight: బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి.. తగ్గేదేలే అంటున్న లీడర్లు!
Related News
Sreeleela: కోలీవుడ్ స్టార్ కు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకో తెలుసా
Sreeleela: కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అందాల తార శ్రీలీల తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న ‘ఓటీటీ’లో ఐటెం సాంగ్ చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. ఓ పాటతో తమిళ చిత్రసీమలో తన కెరీర్ ను ప్రారంభించడం ఆమెకు ఇష్టం లేదని, కోలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఓటీటీ’ చిత్ర నిర్మాతల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని చెన్నై వర్గాలు త�