HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sravanti Ravi Kishore Movie Selected For Indian Film Festival

Kida Movie: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన స్రవంతి రవి కిశోర్ మూవీ!

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు

  • Author : Balu J Date : 22-10-2022 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kida
Kida

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. ‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”ఆర్ఏ వెంకట్ ఈ ‘కిడ’ కథను చెప్పినప్పుడు ఇందులో విషయం ఉందని అర్థమైంది. అందరికీ కనెక్ట్ అవుతుందని వెంటనే ఓకే చేశా. ఇది పేరుకు తమిళ చిత్రమే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా యూనివర్సల్ అయ్యింది. భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏ భాషలో సినిమా తీసినా సరే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అవుతుందనే ఉద్దేశంతో తమిళంలో తీశాం.

మూడున్నర దశాబ్దాల మా స్రవంతి మూవీస్ ప్రయాణంలో తొలి తమిళ చిత్రమిది. తమిళనాడులోని మధురై జిల్లాలో కంబూర్ అనే కుగ్రామంలో ‘కిడ’ చిత్రీకరణ చేశాం. దీపావళి అనేది అందరికీ పెద్ద పండగ. ముఖ్యంగా తమిళ ప్రజలకు, అక్కడి చిన్నారులకు దీపావళి ఇంకా పెద్ద పండగ. పండక్కి కొత్త దుస్తులు కొనుక్కోవడం ఆనవాయితీ. పల్లెల్లో ఎవరైనా సరే తమ తాహతుకు మించి పిల్లలకు కొత్త దుస్తులు కొనివ్వాలని తాపత్రయపడుతుంటారు. కొనిచ్చిన తర్వాత తామే దుస్తులు ధరించినట్టు ఆనందపడతారు. ఆ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. మనవడి కోసం ఓ తాతయ్య తనకు తానే ఓ ఛాలెంజ్ విసురుకుంటాడు. ఆ ఛాలెంజ్ ఏమిటన్నది సినిమాలో చూడాలి. అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులను తాకే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి.

ఎమోషనల్ చిత్రమిది. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – 2022లో ప్రదర్శనకు ఇండియన్ పనోరమా మా సినిమాను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. తమిళం నుంచి ‘జై భీమ్’తో పాటు ‘కిడ’ను ఎంపిక చేయడం మరింత ఆనందకరంగా ఉంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అన్ని భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. నవంబర్ 20 నుంచి 28 వరకు 53వ గోవాలో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను నిర్వహించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kida
  • Sravanthi Ravi Kishore
  • tamil nadu

Related News

Rajendra Prasad

ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్‌

Rajendra Prasad  ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దివంగత తమిళ నటుడు ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటే

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd