Singer Sunitha: నేను ప్రెగ్నెంటా.. నాకే తెలియదు : రూమర్స్ పై సునీత రియాక్షన్!
గతకొన్ని రోజులుగా సునీత (Singer Sunitha) ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది.
- Author : Balu J
Date : 15-02-2023 - 2:44 IST
Published By : Hashtagu Telugu Desk
తన స్వీట్ వాయిస్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సింగర్ సునీత (Singer Sunitha). అందానికి అందం.. గాత్రానికి గాత్రం రెండు తోడుకావడంతో సునీతకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇక సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఎంతో మంది హీరోయిన్‌లకు గాత్రం దానం చేసింది. ఇక ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా సునీత (Singer Sunitha) ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది. ‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది.
19ఏళ్ల వయసులోనే సునీత (Singer Sunitha).. కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు. సునీత కూతురు టాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తుంది. కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక రెండేళ్ల కిందట ప్రముఖ వ్యాపార వేత్త రామకృష్ణ వీరపనేనిని వివాహం చేసుకుంది. 42ఏళ్లకు రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో ఎక్కింది. రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సునీత ప్రెగ్నెంట్ (Pregnant) అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు.. ఆమె భర్తపై నెటిజన్స్ కు ట్రోలింగ్ కు దిగడంతో ఘాటుగానే బుద్ది చెప్పారు.
Also Read: Disha Patani: టైట్ ఫిట్ డ్రస్సులో.. ఎద అందాలను చూపుతూ!