Skanda First Talk : పది రోజుల ముందే ఆన్లైన్ ‘స్కంద’ హల్చల్
ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్, కామెడీతో నడిపించిన బోయపాటి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించారని, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాల బాగుందని, ముఖ్యంగా ఆఖరి 15 నుంచి 20 నిమిషాలు సినిమా అదిరిపోయిందని తెలిపాడు
- By Sudheer Published Date - 10:17 PM, Tue - 19 September 23
హీరో రామ్ (Ram) – మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda ). ధమాకా ఫేమ్ శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని..రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల 28 న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ తరుణంలో స్కంద మూవీ తాలూకా టాక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేంటి ఇంకా విడుదలకు పది రోజుల సమయం ఉంది..కదా అప్పుడే టాక్ బయటకు రావడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
‘స్కంద’ సినిమాను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాలీ మూవీస్ అనే సంస్థ విడుదల చేస్తోంది. అయితే, ఆస్ట్రేలియాలోని డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ టీమ్‌లో మెంబర్నంటూ ఒక వ్యక్తి ఎక్స్(ట్విట్టర్)లో ‘స్కంద’ ఫస్ట్ రివ్యూ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫస్టాఫ్ లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ సీన్స్‌తో నడిచిందని, మరోసారి రామ్ డాన్స్ చించేసాడని, ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే సెకండ్ హాఫ్ ఫై విపరీతమైన హైప్ పెంచిందని చెప్పుకొచ్చాడు. మరోసారి థమన్ తన బ్యాక్ గ్రౌండ్ తో అదరగొట్టాడని చెప్పుకొచ్చాడు.
Read Also : Tollywood : పాపం శివాత్మిక…గట్టిగానే చూపిస్తుంది కానీ..చాన్సులే రావట్లే
ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్, కామెడీతో నడిపించిన బోయపాటి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించారని, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాల బాగుందని, ముఖ్యంగా ఆఖరి 15 నుంచి 20 నిమిషాలు సినిమా అదిరిపోయిందని తెలిపాడు. మరి ఈయన తెలిపినట్లు సినిమా అలాగే ఉందా..లేదా అనేది ఈ నెల 28 న తెలుస్తుంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించగా.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ లో సీనియర్ హీరో శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు.
#Skanda
Final Output :1st half Good – Love track, Comedy Senses with Heroine 👌, Dance 🔥🔥
Interval Block 🔥🔥🔥Bgm 🥵🥵 #Thaman On Duty 🔥💥
2nd Half with Family Emotions 👍#CultMama Song, dance 🔥🔥🔥🔥
2nd Half >>> 1st Half
Last 15-20mins Has Good Content1st Week… pic.twitter.com/Aux21ISlcW
— Australian Telugu Films (@SrTelugu) September 17, 2023
Related News
Ram Parasuram : పరశురామ్ కి ఆఫర్ ఇస్తున్న ఇస్మార్ట్ హీరో.. డబుల్ ఇస్మార్ట్ తర్వాత అతనితోనే ఫిక్స్..!
Ram Parasuram ఇస్మార్ట్ హీరో రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ఎక్కువశాతం